Share News

GCC ఎండీయూ వ్యవస్థతో తగ్గిన జీసీసీ వ్యాపారం

ABN , Publish Date - Jun 17 , 2025 | 11:27 PM

GCC Trade Declines with the Implementation of the MDU System గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఎండీయూ ( మొబైల్‌ డిస్పెన్స్‌ యూనిట్‌ ) వాహనాల వల్ల జిల్లాలో జీసీసీ వ్యాపారం భారీగా తగ్గిందని, సుమారు రూ. 6.8 కోట్ల వరకు కోల్పోయినట్లు డీఎం జలుమూరి రామారావు తెలిపారు.

GCC  ఎండీయూ వ్యవస్థతో తగ్గిన జీసీసీ వ్యాపారం
కొత్తవలస డీఆర్‌ డిపోను పరిశీలిస్తున్న జీసీసీ డీఎం రామారావు

సాలూరు రూరల్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఎండీయూ ( మొబైల్‌ డిస్పెన్స్‌ యూనిట్‌ ) వాహనాల వల్ల జిల్లాలో జీసీసీ వ్యాపారం భారీగా తగ్గిందని, సుమారు రూ. 6.8 కోట్ల వరకు కోల్పోయినట్లు డీఎం జలుమూరి రామారావు తెలిపారు. మంగళవారం కొత్తవలస డీఆర్‌ డిపోను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థ లేనప్పుడు గిరిజనులు డీఆర్‌ డిపోలకు వచ్చి రేషన్‌ తీసుకునేవారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకుని వారి ఉత్పత్తుల విక్రయించేవారు. దీంతో ఏటా జీసీసీకి జిల్లాలో రూ. 12 కోట్ల వ్యాపారం జరిగేది. గత ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థ తీసుకురావడం వల్ల డీఆర్‌ డిపోలకు గిరిజనులు రావడం మానేశారు. దీంతో జీసీసీ వ్యాపారం రూ.5.2 కోట్లకు పడిపోయింది. ఏటా రూ.6.8 కోట్ల వ్యాపారం కోల్పోవడంతో జీసీసీ బలహీన పడింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థకు స్వస్తి చెప్పి డీలర్ల ద్వారా సరుకుల పంపిణీ చేయించడం జీసీసీకి వరంగా మారింది. డీఆర్‌ డిపోలకు గిరిజనులు వస్తున్నారు. రేషన్‌తో పాటు నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో డీఆర్‌ డిపోలు బలోపేతం కానున్నాయి. గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను ఎప్పుడైనా డీఆర్‌ డిపోలల్లో విక్రయించుకోవచ్చు. మన్యం జిల్లాలో 95 , విజయనగరం జిల్లాలో ఆరు డీఆర్‌ డిపోలున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో 26 డీఆర్‌ డిపోలకు నూతన భవనాలు నిర్మించడానికి, మరో 36 డిపోలకు మరమ్మతులు చేయడానికి ప్రతిపాదనలు పంపించాం.’ అని తెలిపారు.

Updated Date - Jun 17 , 2025 | 11:28 PM