Share News

భావితరాలకు గౌతు లచ్చన్న స్ఫూర్తి

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:00 AM

భావితరాలకు స్వాత్రంత్య సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న స్ఫూర్తిదాయకమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.శనివారం స్థానిక కలెక్టర్‌ కార్యా లయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సర్దార్‌ గౌతు లచ్చన్న 116 జయంత్యుత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లచ్చన్న చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులఅర్పించారు.

 భావితరాలకు గౌతు లచ్చన్న స్ఫూర్తి
గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న విజయచంద్ర :

పార్వతీపురం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): భావితరాలకు స్వాత్రంత్య సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న స్ఫూర్తిదాయకమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.శనివారం స్థానిక కలెక్టర్‌ కార్యా లయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సర్దార్‌ గౌతు లచ్చన్న 116 జయంత్యుత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లచ్చన్న చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులఅర్పించారు. అనం తరం విజయచంద్ర మాట్లాడుతూ లచ్చన్న దూరదృష్టి, దృఢమైన గాంధేయవాదంతో అంటరానితనం, సామాజిక వివక్షకు వ్యతిరకంగా పోరాడార న్నారు. హరిజన సేవాసంఘాన్ని స్థాపించి వారి కోసం రాత్రి పాఠశాలలు ప్రారంభించారని, బలహీనవర్గాల అభ్యున్నతికోసం పనిచేశా రని తెలిపారు. రైతు రక్షణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా అఖిలభారత కిసాన్‌సభను నిర్వహించిన ఘనత ఆయనదేన న్నారు.రైతులు, గిరిజన సంఘాలకు అండగా నిలవడమేకాకుండా రైతుల హక్కులను కాపాడడానికి విశేష కృషిచేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సమావేశంలో డీఆర్వో హేమలత, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారిత అధికారి ఇ.అప్పన్న, జిల్లా శాలివాహన కుమ్మరిసంఘ ప్రధానకార్యదర్శి ఉరిటి యాదవ్‌, టీడీపీ నాయకులు జీవీ నాయుడు, జీవీ రమణ, దేవిచంద్రమౌళి, కె.నారాయణరావు, శివ, గణేష్‌, జి.రవికుమార్‌, మరియదాసు పాల్గొన్నారు.

ఫగరుగుబిల్లి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామా ల్లో శనివారం సర్ధార్‌ గౌతులచ్చన్న జయంతి నిర్వహించారు. ఉల్లిభద్ర, నాగూరు పరిధిలోని లచ్చన్న విగ్రహాలకు కొప్పల వెలమ సంక్షేమ కార్పొ రేషన్‌ డైరెక్టర్‌ అక్కేన మధుసూదనరావు, ఏఎంసీ డైరెక్టర్‌ తంగుడు ఆనందరావు, టీడీపీనాయకులు యడ్ల శ్రీనివాసరావు, మరడాన నారాయణ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - Aug 17 , 2025 | 12:00 AM