Share News

Gauthu Lachanna is an ideal person. గౌతు లచ్చన్న ఆదర్శనీయుడు

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:05 AM

Gauthu Lachanna is an ideal person. స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న ఆదర్శనీయుడని, భావితరాలకు ఆయనో స్ఫూర్తి అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ చెప్పారు. గౌతు లచ్చన్న జయంతిని ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై గౌతులచ్చన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు.

Gauthu Lachanna is an ideal person. గౌతు లచ్చన్న ఆదర్శనీయుడు
మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌

గౌతు లచ్చన్న ఆదర్శనీయుడు

నమ్మిన సిద్ధాంతం కోసం రాజీ లేని పోరాటం

మంత్రి కొండపల్లి

విజయనగరం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న ఆదర్శనీయుడని, భావితరాలకు ఆయనో స్ఫూర్తి అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ చెప్పారు. గౌతు లచ్చన్న జయంతిని ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై గౌతులచ్చన్న చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, తాను నమ్మిన సిద్ధాంతం కోసం రాజీపడకుండా, జీవితాంతం పోరాటం చేసిన వ్యక్తి లచ్చన్న అని అన్నారు. 1978లోనే చట్టసభలో ప్రతిపక్ష నేతగా, పీఏసీ చైర్మన్‌గా, మంత్రిగా, ప్రజానాయకుడిగా విశేష సేవలు అందించారన్నారు. జిల్లాలో గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. బడుగు, బలహీనవర్గాలకు ఆయన దిక్సూచి లాంటివారన్నారు. ఉత్తరాంధ్రకు గౌతు లచ్చన్న అందించిన సేవలకు కృతజ్ఞతగా చంద్రబాబునాయుడు తోటపల్లి ప్రాజెక్టుకు లచ్చన్న పేరును నామకరణం చేశారని గుర్తుచేశారు. కలెక్టర్‌ బీఅర్‌ అంబేడ్కర్‌ మాట్లాడుతూ, గౌతు లచ్చన్న గొప్ప సామాజిక కార్యకర్తని, ఆయన గొప్పతనం భావితరాలకు తెలియజేసేందుకు ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ బంగార్రాజు మాట్లాడుతూ, గౌతు లచ్చన్న ఉద్యమాలకు నిప్పుకణిక అని, ఆయన జీవితం ఉద్యమాలతో సాగిందన్నారు. కార్యక్రమంలో తూర్పుకాపుకార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పాలవలస యశస్విని, డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, డీఈఓ మాణిక్యంనాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్‌ నల్లనయ్య, బీసీ సంక్షేమ శాఖాధికారి జ్యోతిశ్రీ, ఉపకులాల జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ ఆదినారాయణ, రజక సంఘం రాష్ట్ర నాయకురాలు విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 12:05 AM