భక్తిశ్రద్ధలతో గౌరీపౌర్ణమి పూజలు
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:30 AM
Gauripournami Pujas Performed with Devotion and Reverence గౌరీ పౌర్ణమి సందర్భంగా సోమవారం జిల్లావ్యాప్తంగా నందన్న ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చాలాచోట్ట నందన్న, శివ పార్వతుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి మండపాల్లో కొలువుదీర్చారు. అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
జిల్లాలో ప్రారంభమైన ఉత్సవాలు
సాలూరు/వీరఘట్టం/భామిని,అక్టోబరు6(ఆంధ్రజ్యోతి): గౌరీ పౌర్ణమి సందర్భంగా సోమవారం జిల్లావ్యాప్తంగా నందన్న ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చాలాచోట్ట నందన్న, శివ పార్వతుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి మండపాల్లో కొలువుదీర్చారు. అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సాలూరు పట్టణంలోని పలు వీధులతో పాటు గుమడాం, బంగారమ్మపేట తదితర ప్రాంతాల్లో నందెన్నను కొలువుదీర్చారు. పరిసర ప్రాంతవాసులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భామినిలో మహిళలు ఉప వాసాలతో గౌరీదేవికి పూజలు నిర్వహించారు. పిండివంటలు, పండ్లును అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. వీరఘట్టం, నడిమికెల్ల, కడకెల్ల తదితర గ్రామాల్లోనూ మేళతాళాలతో నందన్న విగ్రహాలను ఊరేగించారు. నవరాత్రుల పాటు సంబరాలు చేసేందుకు కొన్నిచోట్ల ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేశాయి. మొత్తంగా అంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.