ganja గంజాయి రవాణాను అరికట్టాల్సిందే..
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:26 AM
ganja Trafficking Must Be Stopped ఒడిశా నుంచి గంజాయి ఏ దారిలో వచ్చినా ఆరికట్టాలని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశించారు. ఒడిశా, అరకు ప్రాంతం నుంచి వచ్చే సిక్స్‌లైన్ హైవే తదితర మార్గాలను బుధవారం పరిశీలించారు.

సాలూరు రూరల్, మార్చి 12 ( ఆంధ్రజ్యోతి ): ఒడిశా నుంచి గంజాయి ఏ దారిలో వచ్చినా ఆరికట్టాలని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశించారు. ఒడిశా, అరకు ప్రాంతం నుంచి వచ్చే సిక్స్‌లైన్ హైవే తదితర మార్గాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గంజాయి రవాణా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలిచ్చారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేయాలన్నారు. హైవేలకు సమీపంలో ఉన్న చిన్న చిన్న రహదారులపై వచ్చే వాహనాలను సైతం పరిశీలించాలని సూచించారు. ఏ మార్గంలోనూ జిల్లా గుండా గంజాయి రవాణా జరగరాదన్నారు. అనంతరం సాలూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. ఏ విధంగా పనిచేయాలనే విషయమై శిక్షణకు వచ్చిన ప్రొహిషనరీ ఎస్‌ఐలకు దిశానిర్దేశం చేశారు. స్టేషన్ విధులపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలన్నారు. కూంబింగ్ ఆపరేషన్లు, క్షేత్ర పరిస్థితులపై పట్టు సాధించాలని సూచించారు. సీఐలు రామకృష్ణ, అప్పలనాయుడు, ఎస్‌ఐలు నరసింహమూర్తి, వెంకట సురేష్ తదితరులున్నారు.