Share News

ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్టు

ABN , Publish Date - May 08 , 2025 | 11:39 PM

గత కొన్ని నెలలుగా సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లను టార్గెట్‌ చేస్తూ దొంగతనానికి పాల్పడిన ముఠా గురువారం పోలీసులకు చిక్కారు.

ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న సీఐ అప్పలనాయుడు, స్వాధీనం చేసుకున్న ట్రాన్స్‌ఫార్మర్ల సామగ్రి

లక్కవరపుకోట, మే 8(ఆంధ్రజ్యోతి): గత కొన్ని నెలలుగా సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లను టార్గెట్‌ చేస్తూ దొంగతనానికి పాల్పడిన ముఠా గురువారం పోలీసులకు చిక్కారు. ఎస్‌.కోట రూరల్‌ సీఐ ఎల్‌.అప్పలనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర నిఘా పెట్టారు. ఎట్టకేలకు గురువారం పాటూరు గ్రామం వద్ద పోలీసులకు చిక్కారు. ఈ ముఠాలో 8 మందికి గానూ ఆరుగురు చిక్కారు. ఇద్దరు పరారీలో ఉన్నట్టు సీఐ తెలిపారు. పట్టుబడ్డవారిని ఎల్‌.కోట పోలీసు స్టేషన్‌లో హాజరుపరిచారు. కొత్తవలస, వేపాడ, ఎల్‌.కోట, జామి మండలాల్లో వీరు దొంగతనాలకు పాల్పడినట్టు తెలిపారు. సింగిల్‌ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ మోటార్లు, కార్లు, ట్రాక్టర్ల బ్యాటరీలు, పంపుసెట్లు స్టార్టర్లు వీరి టార్గెట్‌. సుమారు రూ.5లక్షల విలువగల 15 కేసులకు సంబంధించిన వస్తువులను రికవరీ చేసినట్లు సీఐ పేర్కొన్నారు. మహమ్మద్‌ అహమ్మద్‌, ఆర్‌.బంగారునాయుడు, కే.యోగేంద్ర, సలీమ్‌, ఆదిత్య, రసూల్‌లను అరెస్టుచేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేపాడ ఎస్‌ఐ సుదర్శన్‌, ఎల్‌.కోట ఎస్‌ఐ నవీన్‌పడాల్‌, జామి ఎస్‌ఐ వీరజనార్ధన్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 11:39 PM