గాజులరేగ పీఏసీఎస్‌కు పూర్వ వైభవం: నాగార్జున
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:56 PM
: రైతుల నుంచి డిపాజిట్లు సేకరణ వేగవంతం చేసి బ్యాంకు అభి వృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని డీసీ సీబీ చైర్మన్ కిమిడి నాగార్జున స్పష్టం చేశారు. గాజులరేగ పీఏసీఎస్‌కు పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు.
విజయనగరం టౌన్, నవంబరు3 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి డిపాజిట్లు సేకరణ వేగవంతం చేసి బ్యాంకు అభి వృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని డీసీ సీబీ చైర్మన్ కిమిడి నాగార్జున స్పష్టం చేశారు. గాజులరేగ పీఏసీఎస్‌కు పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. సోమవారం విజయనగరంలోని గాజు లరేగ పీఏసీఎస్‌లో అందిస్తున్న సేవలను, లావీదేవీలను పరిశీలించారు.ఈ సందర్భం గా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 30 ఏళ్ల కిందట 6,800మంది సభ్యులతో నడిచిన బ్యాంకులో నేడు కేవలం 108 సభ్యులు మాత్రమే తమ ఆధార్ నెంబర్‌తో యాక్టివ్‌గా ఉండడంపై, తాను ఒక్కసారిగా అవాక్కయ్యానని, మిగతా వారంతా బినామీ ఖాతాలతో ఉండి రుణాలు పొందడం వెనుక జరిగిన తీరుపై దృష్టి సారించి లెక్కలు తేల్చే సమయం ఆసన్నమైందన్నారు. కార్య క్రమంలో డీసీసీబీ సీఈఓ ఉమామహేష్, పీఏసీఎస్ చైర్మన్ కోరాడ వెంకటరావు, డీసీసీబీ మేనేజర్ ప్రసాద్, సీఈఓ సత్యనారాయణ, వీటీఅగ్రహారం పీఏసీఎస్ సఈఓ పూర్ణిమా పాల్గొన్నారు.