Central Schemes కేంద్ర పథకాలతో మరింత అభివృద్థి
ABN , Publish Date - Jun 28 , 2025 | 11:02 PM
Further Development through Central Schemes కేంద్ర ప్రభుత్వ పథకాలతో గిరిజన ప్రాంతాలు మరింత అభివృద్థి చెందుతాయని మినిస్ర్టీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫెర్ అసిస్టెంట్ సెక్షన్ అధికారి రాహుల్ ఖురానా అన్నారు. శనివారం సీతంపేట ఏజెన్సీలో ఆయన పర్యటించారు. ముందుగా సీది, కె గుమ్మడలో నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్నారు.
సీతంపేట రూరల్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ పథకాలతో గిరిజన ప్రాంతాలు మరింత అభివృద్థి చెందుతాయని మినిస్ర్టీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫెర్ అసిస్టెంట్ సెక్షన్ అధికారి రాహుల్ ఖురానా అన్నారు. శనివారం సీతంపేట ఏజెన్సీలో ఆయన పర్యటించారు. ముందుగా సీది, కె గుమ్మడలో నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్నారు. సీది గ్రామంలో సేంద్రియ పద్ధతిలో గిరిజన రైతులు పండించే పైనాపిల్, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందించే పౌష్టికాహారాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుడూ.. ఆదివాసీ గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం జన్‌మన్ జుగా వంటి పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ పఽథకాలతో గిరిజనులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని అన్నారు. గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో ఆయన వెంట టీడబ్ల్యూ ఈఈ కుమార్, ఎంపీడీవో మిశ్రో, డీఈ సింహాచలం, డిప్యూటీ ఎంపీడీవో రామకృష్ణ, హౌసింగ్ ఏఈ వెంకటేష్ పాల్గొన్నారు.