అనాథ మృతదేహానికి అంతిమ సంస్కారాలు
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:04 AM
అనాథ మృతదేహానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేసి... మానవత్వాన్ని చాటుకున్నారు బొబ్బిలి పోలీసులు. వివరాలివీ.. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి ఈనెల 14న స్థానిక ప్రభుత్వ ఐటీఐ సమీపంలో హెచ్‌టీ విద్యుత్ టవర్ పైకి ఎక్కి... షాక్‌తో అక్కడి నుంచి పడిపోవడంతో గాయాలపాలయ్యాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందాడు.
బొబ్బిలి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): అనాథ మృతదేహానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేసి... మానవత్వాన్ని చాటుకున్నారు బొబ్బిలి పోలీసులు. వివరాలివీ.. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి ఈనెల 14న స్థానిక ప్రభుత్వ ఐటీఐ సమీపంలో హెచ్‌టీ విద్యుత్ టవర్ పైకి ఎక్కి... షాక్‌తో అక్కడి నుంచి పడిపోవడంతో గాయాలపాలయ్యాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందాడు. ఆ మృతదేహం కోసం ఎవరైనా వస్తారే మోనని సీహెచ్‌సీ మార్చురీలో రెండు రోజులు ఉంచారు. ఎవరూ రాకపోవడంతో పోలీసులు , సామాజిక కార్యకర్త క్లైవ్ కూపర్ సహకారంతో ఎస్‌ఐ రమేష్ సొంత ఖర్చులతో అనాథ మృత దేహానికి అంత్యక్రియలు చేయించారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని క్లైవ్ ప్రార్థనలు చేశారు.