Panchayats పంచాయతీలకు నిధులు
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:07 AM
Funds for Panchayats జిల్లాలోని 15 మండలాల పరిధిలోని పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు పంచాయతీల వెండర్ కోడ్‌తో పాటు డీడీవో కోడ్‌లకు జమ చేశారు.
గరుగుబిల్లి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 15 మండలాల పరిధిలోని పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు పంచాయతీల వెండర్ కోడ్‌తో పాటు డీడీవో కోడ్‌లకు జమ చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడతలో టైప్ గ్రాంటుగా రూ. 13.19కోట్లు, బేసిక్ అన్‌టైప్ గ్రాంటుగా రూ. 8.79 కోట్లు జమయ్యాయి. వాటితో గ్రీన్ అంబాసిడర్లకు వేతనాలు, సీసీ చార్జులు చెల్లించనున్నారు. పారిశుధ్య నిర్వహణతో పాటు తాగునీరు సరఫరాకు ప్రాధాన్య క్రమంలో నిధులు వెచ్చించనున్నారు. పంచాయతీలకు సంబంధించి నిధులు జమయ్యాయని, కార్యదర్శులు ప్రాధాన్యం మేరకు వినియోగించాలని డిప్యూటీ ఎంపీడీవో ఎల్.గోపాలరావు తెలిపారు.