ఇంధన పొదుపు పాటించాలి
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:35 AM
ఇంధన పొదుపు ప్రగతికి మార్గమని కలెక్టరు ఎస్. రామసుందర్‌రెడ్డి అన్నారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఎపీఈపీడీసీఎల్ సోమవారం నగరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ కలెక్టరేట్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
కలెక్టరు రామసుందర్‌రెడ్డి పిలుపు
విజయనగరం రింగురోడ్డు, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఇంధన పొదుపు ప్రగతికి మార్గమని కలెక్టరు ఎస్. రామసుందర్‌రెడ్డి అన్నారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఎపీఈపీడీసీఎల్ సోమవారం నగరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ కలెక్టరేట్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా విద్యుత్ పొదుపు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆదాపై దృష్టి పెట్టాలన్నారు. విద్యుత్‌ను ఆదాచేసే ఐదు స్టార్ పరికరాలను వినియోగిం చాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఈ లక్ష్మణరావు, ఈఈలు త్రినాథ్‌రావు, సురేష్‌బాబు, రఘు, ఏడీఈ కిరణ్‌కుమార్, డీఈలు, ఏఈలు, విద్యుత్ సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.