From Peddagedda to Salur పెద్దగెడ్డ టు సాలూరు
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:13 AM
From Peddagedda to Salur పెద్దగెడ్డ నుంచి సాలూరు మున్సిపాలిటీ వాసులకు తాగునీరందించేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు శనివారం పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ చీఫ్ ప్రభాకరరావు పెద్దగెడ్డ ప్రాజెక్టును పరిశీలించారు.
ప్రాజెక్టును పరిశీలించిన ఇంజనీరు చీఫ్
పాచిపెంట, నవంబరు22(ఆంధ్రజ్యోతి): పెద్దగెడ్డ నుంచి సాలూరు మున్సిపాలిటీ వాసులకు తాగునీరందించేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు శనివారం పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ చీఫ్ ప్రభాకరరావు పెద్దగెడ్డ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ 2018లో రూ. 64 కోట్లతో వాటరు స్కీం మంజూరైంది. ఏడు ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ల పర్ డే) ప్లాంటు ఏర్పాటు నిమిత్తం మళ్లీ ఇప్పుడు రివైజ్ వేసి టెండరు పిలిచాం. సాలూరు మున్సిపాలిటీలో 50 వేల జనాభాకు తాగునీరు కల్పనకు చర్యలు చేపట్టాం. జనాభా ప్రాతిపదికన ఒక వ్యక్తికి 135 లీటర్ల చొప్పున నీరు సరఫరా చేయాల్సి ఉంది. ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ శాఖల అనుసంధానంతో సాలూరు సమీపంలోని కాకులతోట వద్ద ఏడు ఎంఎల్‌డీ ప్లాంటు నిర్మిస్తాం. సంక్రాంతి తరువాత పనులు చేపట్టి రెండేళ్లలో పూర్తి చేస్తాం.’ అని తెలిపారు. ఈ పరిశీలనలో పబ్లిక్ హెల్త్ సీఈ సుధాకరరావు, ఎస్‌ఈ కామేశ్వరరావు, ఈఈ జ్యోతి, డీఈఈ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.