Share News

From Garugubilli to Seethanagaram గరుగుబిల్లి నుంచి సీతానగరం

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:38 PM

From Garugubilli to Seethanagaram గరుగుబిల్లి మండలంలోని 15 రోజులకు పైగా సంచరించిన గజరాజులు సీతానగరం వైపు పయనమయ్యాయి. శనివారం ఆ మండలంలోని బూర్జ-వెంకటాపురం గ్రామాల మధ్య అవి సంచరించాయి. దీంతో ఆయా గ్రామస్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

From Garugubilli to Seethanagaram గరుగుబిల్లి నుంచి సీతానగరం
బూర్జ సమీప పంట పొలాల్లో సంచరిస్తున్న ఏనుగులు

గరుగుబిల్లి/సీతానగరం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): గరుగుబిల్లి మండలంలోని 15 రోజులకు పైగా సంచరించిన గజరాజులు సీతానగరం వైపు పయనమయ్యాయి. శనివారం ఆ మండలంలోని బూర్జ-వెంకటాపురం గ్రామాల మధ్య అవి సంచరించాయి. దీంతో ఆయా గ్రామస్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పగలంతా తోటలు, పొలాల్లో ఉంటున్న ఏనుగులు సాయంత్రం వేళల్లో జనావాసాల్లోకి వస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు అటవీశాఖ సిబ్బంది, ట్రాకర్లు ఏనుగులను పర్యవేక్షిస్తున్నారు. చినగుడబ నుంచి అనుకోకుండా సీతానగరం మండలం వైపు ఏనుగులు వచ్చాయని, వాటిని జోగింపేట జోన్‌కు తరలించడం తన పరిధిలో లేదని బీట్‌ ఆఫీసర్‌ సతీష్‌ తెలిపారు. మొత్తంగా ఎనిమిది గజరాజులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి మాట్లాడుతూ.. త్వరలో రెండు కుంకీలు రానునున్నాయని వాటి సాయంతో జిల్లాలో ఏనుగులను వేరే ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు. సీతానగరం మండలం గుచ్చిమి పరిధిలో వాటికోసం ప్రత్యేక షెల్టర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏనుగుల కారణంగా నష్టం వాటిల్లిన రైతులకు తగిన పరిహారం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 11:38 PM