Share News

Friendly Happy Day ప్రతి శనివారం ఫ్రెండ్లీ హ్యాపీ డే

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:08 PM

Friendly Happy Day Every Saturday జిల్లాలోని విద్యాలయాల్లో ప్రతి శనివారం ‘ఫ్రెండ్లీ హ్యాపీ డే’ పాటించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి సూచించారు. శనివారం జోగింపేటలోని బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులం పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.

Friendly Happy Day   ప్రతి శనివారం ఫ్రెండ్లీ హ్యాపీ డే
విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

సీతానగరం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని విద్యాలయాల్లో ప్రతి శనివారం ‘ఫ్రెండ్లీ హ్యాపీ డే’ పాటించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి సూచించారు. శనివారం జోగింపేటలోని బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులం పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వంటశాల, పాఠశాల పరిసరాలు, రికార్డులు, హాజరుపట్టికను పరిశీలించారు. బోధనపై ఆరా తీశారు. సమస్యలేమైనా ఉన్నాయా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య స్నేహ పూర్వక వాతావరణం కల్పించేందుకు ప్రతి శనివారం ‘ఫ్రెండ్లీ హ్యాపీ డే’ నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా దీనిని అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుం టామన్నారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి సందడి చేశారు. సరదాగా స్టెప్పులు వేస్తూ.. సెల్ఫీలు దిగి.. అందర్నీ ఉత్సాహపరిచారు. ఈ పరిశీలనలో జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌ కుమార్‌రెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 11:08 PM