Share News

Civil Services Exams సివిల్స్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ

ABN , Publish Date - Nov 16 , 2025 | 12:04 AM

Free Training for Civil Services Exams సివిల్స్‌లో ప్రిలిమ్స్‌, మెయిన్‌ పరీక్షలకు సంబంధించి నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వను న్నట్లు జిల్లా బీసీ సంక్షేమ, సాధికారిత అధికారి ఇ.అప్పన్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకో వాలన్నారు.

 Civil Services Exams  సివిల్స్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ

పార్వతీపురం రూరల్‌, నవంబరు15(ఆంధ్రజ్యోతి): సివిల్స్‌లో ప్రిలిమ్స్‌, మెయిన్‌ పరీక్షలకు సంబంధించి నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వను న్నట్లు జిల్లా బీసీ సంక్షేమ, సాధికారిత అధికారి ఇ.అప్పన్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకో వాలన్నారు. కుల, విద్య, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌, పాన్‌కార్డు, రెండు ఫొటోలను దరఖాస్తులకు జత చేసి జిల్లాకేంద్రంలోని కార్యాలయానికి అందించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఈ 85001 87124, 97017 86751, 91608 01497 నెంబర్లకు సంప్రదించాలన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 12:04 AM