6,822 కుటుంబాలకు ఉచిత రేషన్
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:34 AM
జిల్లాలో తీర ప్రాంత గ్రామాల్లో గల 6822 కుటుంబాలకు మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం ఉచిత రేషన్ అందజేస్తుందని మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు.
భోగాపురం, నవంబరు1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తీర ప్రాంత గ్రామాల్లో గల 6822 కుటుంబాలకు మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం ఉచిత రేషన్ అందజే స్తుందని మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు. శనివారం మండలలోని చేపలకంచేరులో మత్స్యకారులకు రేషన్ పంపిణీచేశారు. అలాగే పలువురికి పింఛన్లు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ, తహసీల్దార్ ఎం.రమణమ్మ, పౌర సరఫరాల అధికారి మురళి, నాయకులు నీలాపు అప్పలరామిరెడ్డి పాల్గొన్నారు.