Fourth railway line from Vizianagaram to Kothavalasa విజయనగరం నుంచి కొత్తవలసకు నాలుగో రైల్వే లైన్
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:29 PM
Fourth railway line from Vizianagaram to Kothavalasa కొత్తవలస నుంచి విజయనగరం వరకు రైల్వే కొత్త లైన్ రాబోతోంది. 34.1 కిలోమీటర్ల పొడవున నాలుగో లైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు రూ.493 కోట్లను కేటాయించింది. కర్నూలు పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ గురువారం వర్చువల్‌గా ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
విజయనగరం నుంచి కొత్తవలసకు
నాలుగో రైల్వే లైన్
రూ.493 కోట్ల కేటాయింపు
నేడు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ
విజయనగరం/కొత్తవలస, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి):
కొత్తవలస నుంచి విజయనగరం వరకు రైల్వే కొత్త లైన్ రాబోతోంది. 34.1 కిలోమీటర్ల పొడవున నాలుగో లైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు రూ.493 కోట్లను కేటాయించింది. కర్నూలు పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ గురువారం వర్చువల్‌గా ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న ప్రధాని కొత్తవలస - విజయనగరం రైల్వే లైన్‌కు కూడా శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే కొత్తవలస నుంచి విజయనగరం వరకు మూడు రైల్వే లైన్లు ఉన్నాయి. నాలుగో లైన్‌కు భూ సేకరణ కూడా పూర్తయింది. 2026 డిసెంబరు నాటికల్లా ఈ లైన్ ఏర్పాటును పూర్తి చేసే లక్ష్యంతో రైల్వే అధికారులు ఉన్నారు. ఇది పూర్తయితే జిల్లా మీదుగా అనేక కొత్త రైళ్లు వెళ్తాయి. వాటికి హాల్ట్‌లు కేటాయించే అవకాశం ఉంటుంది. సరుకు రవాణా కూడా మరింత సులువు అవుతుంది.
రైల్వే ట్రాఫిక్ తగ్గుతుంది
సీతారామపాత్రుడు, చింతలపాలెం
కొత్తవలస నుంచి విజయనగరం వరకు ప్రస్తుతం ఉన్న మూడు రైల్వే లైన్లకు అదనంగా నాలుగో లైన్ ఏర్పాటు చేయడం వల్ల రైల్వే ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా వందేభారత్ వంటి మరిన్ని రైళ్లు రావడానికి అవకాశం ఉంటుంది. సరుకు రవాణా, ప్రయాణికుల రవాణా కూడా మెరుగవుతుంది.
చాలా ఉపయోగం
లెంకశ్రీను, రాజపాత్రునిపాలెం
కొత్తవలస నుంచి విజయనగరం వరకు నాలుగో రైల్వే లైను ఏర్పాటు చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. రైళ్ల ఆలస్యానికి బ్రేక్ పడుతుంది. జిల్లా ప్రజల ప్రయాణానికి అవకాశాలు పెరుగుతాయి. కొత్త రైళ్లకు హాల్ట్‌లు కేటాయించే అవకాశం ఉంటుంది. అన్ని వర్గాలకూ ఉపయోగమే.
============