Share News

పోక్సో కేసులో నలుగురి అరెస్టు

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:27 AM

బాలికను ప్రేమ పేరిట ఉచ్చులో దింపిన యువకుడితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

పోక్సో కేసులో నలుగురి అరెస్టు

రేగిడి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): బాలికను ప్రేమ పేరిట ఉచ్చులో దింపిన యువకుడితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమా వేశంలో చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు ఆ వివరాలు వెల్లడించారు. రేగిడి మం డలం మునకలవలసకు చెందిన కరణం జగదీశ్‌ ఇదే మండలం ఒక గ్రా మానికి చెందిన బాలికతో కొద్దిరోజులుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. బాలిక తల్లిదండ్రులు పెళ్లిసంబంధాలు చూస్తున్నారు. దీన్ని పసిగట్టిన సదరు యువకుడు బాలికను స్నేహితులతో కలిసి ఊరు దాటించేందుకు పథకం వేశాడు. అందులో భాగంగా మార్చి 26న జడదీశ్‌ చిన్నశిర్లాం గ్రామానికి చెం దిన గొట్టాపు దుర్గాప్రసాద్‌ సహకారం కోరాడు. బాలిక మెడలో చైన్‌ను తాకట్టు పెట్టి వారికి కొంత నగదును ఇచ్చాడు. విజయవాడ రాణితోటలోని మరో ఇద్దరు స్నేహితులు యడ్లగీత, దేవరకొండ బాలు వద్దకు ట్రైన్‌ టికెట్లు సమ కూర్చి అదేరోజు విజయవాడకు దుర్గాప్రసాద్‌ పంపించాడు. అక్కడ వారు ఉండేం దుకు రూమ్‌ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు కుమార్తె అదృశ్య మైందని మార్చి 28న రేగిడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసుల విచారణలో అసలు సంగతి బహిర్గతమైంది. బాలికను ప్రేమ పేరిట వంచించాడని గుర్తించి జగదీశ్‌తో పాటు దుర్గాప్రసాద్‌, యడ్ల గీత, దేవరకొం డ బాలులను అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో రా జాం రూరల్‌ సీఐ ఉపేంద్ర, ఎస్‌ఐ నీలావతి ఉన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:27 AM