Share News

కుమార్తె పెళ్లి చూడకుండా అనంతలోకాలకు..

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:18 AM

చినకుదమ, పెదకుదమ గ్రా మాల మధ్య గౌరీపురం జంక్షన్‌ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.

కుమార్తె పెళ్లి చూడకుండా అనంతలోకాలకు..

  • ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి

జియ్యమ్మవలస, అక్టోబరు13 (ఆంధ్రజ్యోతి): చినకుదమ, పెదకుదమ గ్రా మాల మధ్య గౌరీపురం జంక్షన్‌ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ ఢీకొనడంతో పెదకుదమ గ్రామానికి చెందిన వారాడ నాగ భూషణ(48) మృతిచెందారు. ఈ ఘటనపై చినమేరంగి ఎస్‌ఐ పి.అనీష్‌ తెలిపి న వివరాల ఇలా ఉన్నాయి. పెదకుదమ గ్రామానికి చెందిన వారాడ నాగభూష ణ వేకువజామున చినకుదమ వెళ్లి తిరిగి వస్తుండగా పెదమకుద - చినకుదమ గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ అతడిని ఢీకొంది. విషయాన్ని గమ నించిన స్థానికులు 108 వాహనంపై క్షతగాత్రుడిని పార్వతీపురం జిల్లా కేంద్రా సుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతుడికి భార్య గంగ, కుమారుడు కుమార్‌, కుమార్తె సునీత ఉన్నారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా ఉండగా మృతుడు నాగభూషణ కుమార్తె సునీతకు ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 12న గోధుమరాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. కుమార్తె పెళ్లి చూడకుండా కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Updated Date - Oct 14 , 2025 | 12:18 AM