Share News

how long ఎన్నాళ్లకెన్నాళ్లకు!

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:34 PM

For how long and how often! జిల్లా ఆవిర్భావం తర్వాత పార్వతీపురం ఐటీడీఏలో మొట్టమొదటిసారిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) నిర్వహించారు. కలెక్టర్‌ ఆదేశాలతో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జాయింట్‌ కలెక్టర్‌, ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐటీడీఏ అధికారులు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు.

  how long  ఎన్నాళ్లకెన్నాళ్లకు!
వినతులు స్వీకరిస్తున్న జేసీ

  • వినతులు స్వీకరించిన ఇన్‌చార్జి పీవో

  • హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు

పార్వతీపురం, నవంబరు (ఆంధ్రజ్యోతి): జిల్లా ఆవిర్భావం తర్వాత పార్వతీపురం ఐటీడీఏలో మొట్టమొదటిసారిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) నిర్వహించారు. కలెక్టర్‌ ఆదేశాలతో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జాయింట్‌ కలెక్టర్‌, ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐటీడీఏ అధికారులు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. కురుపాం కేంద్రంగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని , గిరిజన గర్భిణుల వసతిగృహంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు వినతిపత్రం ఇచ్చారు. భూ సమస్యలు పరిష్కరించాలని మరి కొందరు గిరిజనులు అర్జీలు అందించారు. పాచిపెంట మండలం శతాభి గ్రామానికి చెందిన శిలపజన్ని హోరోష్‌ తండ్రి శ్రీరాములు వినతిప త్రాన్ని అందిస్తూ తన కుమారుడు శిలపజన్ని హరోణ్‌కు కళ్లు కనిపించడం లేదని, ఆపరేషన్‌కు రూ.1,80,000 అవసరం అవుతుందని తండ్రి శ్రీరాములు తెలిపారు. దీనిపై స్పందించిన ఇన్‌చార్జి పీవో ఎన్టీఆర్‌ వైద్యసేవ ద్వారా ఆపరేషన్‌ చేయించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతిని ఆదేశించారు. దీంతో ఈ నెల 14న ఆపరేషన్‌కు తేదీ ఖరారు చేశారు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో ఏపీవో మురళీధర్‌, గిరిజన ఇంజనీరింగ్‌ అధికారి మణిరాజు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఏర్పాటుకు ముందు..

జిల్లా ఏర్పాటు కాకముందు ప్రతి సోమవారం పార్వతీపురం ఐటీడీఏలో గ్రీవెన్స్‌ నిర్వహించే వారు. జిల్లా ఆవిర్భావం తర్వాత కొన్ని రోజులు ఏపీవో లేదా ఆ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. అయితే కొన్ని వారాల తర్వాత కలెక్టరేట్‌కు వచ్చి వినతులు అందించాలని అప్పట్లో అధికారులు స్పష్టం చేశారు. దీంతో గత వైసీపీ ప్రభుత్వ కాలంలో గిరి జనులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేకంగా ఐటీడీఏలో గ్రీవెన్స్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అప్పట్లో అఽధికారులకు గిరిజనులు, గిరిజన సంఘాల నాయకులు విన్నవిం చుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాగా సుమారు నాలుగేళ్ల తర్వాత పార్వతీపురం ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహించడంపై గిరిజనులు, ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 07 , 2025 | 11:34 PM