Share News

Bicycle! 57 ఏళ్లుగా... ఎక్కడికెళ్లినా సైకిల్‌పైనే!

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:07 AM

For 57 Years... Everywhere He Goes, It's on a Bicycle! ఒకటి కాదు.. రెండు కాదు.. గత 57 ఏళ్లుగా సైకిల్‌ వినియోగిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు సాలూరుకు చెందిన 70 ఏళ్ల రెడ్డి బాబ్జీ. పట్టణంలోని డబ్బీవీధిలో నివాసం అంటున్న ఆయన ఈ వయసూలోనూ ఎంతో హుషారుగా సైకిల్‌ తొక్కుతారు. పది కిలోమీటర్లు లోపు ఎక్కడికైనా వెళ్లాలంటే సైకిల్‌నే వినియోగిస్తున్నారు.

  Bicycle! 57 ఏళ్లుగా... ఎక్కడికెళ్లినా సైకిల్‌పైనే!
సైకిల్‌పై వస్తున్న రెడ్డి బాబ్జీ

ఒకటి కాదు.. రెండు కాదు.. గత 57 ఏళ్లుగా సైకిల్‌ వినియోగిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు సాలూరుకు చెందిన 70 ఏళ్ల రెడ్డి బాబ్జీ. పట్టణంలోని డబ్బీవీధిలో నివాసం అంటున్న ఆయన ఈ వయసూలోనూ ఎంతో హుషారుగా సైకిల్‌ తొక్కుతారు. పది కిలోమీటర్లు లోపు ఎక్కడికైనా వెళ్లాలంటే సైకిల్‌నే వినియోగిస్తున్నారు. పదమూడో ఏటనే ఆఫ్‌ పెడల్‌ ద్వారా ఆయన సైకిల్‌ నేర్చుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ల వరకు ఆయనకు అదే జీవనాధారంగా మారింది. సాలూరు నుంచి నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్న కూర్మరాజుపేటలో ఉన్న పొలాలకు సైకిల్‌ పైనే వెళ్లేవారు. అప్పట్లో అద్దె ప్రాతిపదికన తీసుకుని వినియోగించేవారు. సుమారు 25 ఏళ్ల కిందట సొంతంగా సైకిల్‌ను కొనుగోలు చేసుకున్నారు. దానికే మరమ్మతులూ చేపడుతూ.. ఇప్పటికీ వినియోగిస్తున్నారు. అప్పట్లో నేరేళ్లవలస, తోణాం, దుగ్గేరు సంతలకెళ్లి చీపుర్లు, చింతపండు కొనుగోలు చేసి వాటిని సైకిల్‌పైనే తెచ్చేవారు. గజపతినగరం, చల్లవానిపేట, పాశలవలస తదితర గ్రామాలకు కూడా వెళ్లేవారు. సైకిల్‌ తొక్కడం వల్ల తన ఆరోగ్యం బాగుంటుందని బాబ్జీ తెలిపారు.

- సాలూరు రూరల్‌, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి)

Updated Date - Jun 03 , 2025 | 12:07 AM