నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - May 31 , 2025 | 12:21 AM
రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు సినిమా థియేటర్లలో ధరలు అమలు చేయాలని ఆర్డీవో జీఎస్‌ఎస్ రామ్మోహనరావు ఆదేశించారు.
ఆర్డీవో రామ్మోహనరావు
సినిమా థియేటర్ల తనిఖీ
బొబ్బిలి రూరల్, మే 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు సినిమా థియేటర్లలో ధరలు అమలు చేయాలని ఆర్డీవో జీఎస్‌ఎస్ రామ్మోహనరావు ఆదేశించారు. బొబ్బిలి పట్టణంలోని డీబీఆర్, శ్రీలక్ష్మి, వాసవి థియేటర్లను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. సినిమా టికెట్లు, తినుబండారాలు, సైకిల్ స్టాండ్ ధరలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకే ధరలు అమలు చేయకపోతే హాలు మూసేందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీబీఆర్, శ్రీలక్ష్మి థియేటర్లు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. వాసవీ థియేటర్‌లో ధరల బోర్డు, లైసెన్స్ లేనట్లు గుర్తించామని, రేపటిలోగా లైసెన్స్ చూపించకపోతే చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హెచ్చరించారు. ఈ తనిఖీల్లో స్థానిక తహసీల్దార్ ఎం.శ్రీను, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.