చిరుధాన్యాల సాగుపై దృష్టిసారించాలి
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:43 PM
మార్కెట్‌కు అనుగుణంగా రైతులు పంటలు పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి కోరారు. రైతులు చిరుధాన్యాలు పండించ డంపై దృష్టి సారించాలని తెలిపారు.
భోగాపురం, డిసెంబరు3(ఆంధ్రజ్యోతి): మార్కెట్‌కు అనుగుణంగా రైతులు పంటలు పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి కోరారు. రైతులు చిరుధాన్యాలు పండించ డంపై దృష్టి సారించాలని తెలిపారు. బుధవారం భోగాపురం సచివాలయ ఆవరణలో రైతన్నా-మీకోసం సర్వేపై వర్క్ షాపునకు సంబందించి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమణమ్మ, ఎంపీడీవో డీడీ స్వరూపరాణి,వ్యవసాయ, పశుసంవర్థకశాఖ ఏడీలు నాగ భూషణరావు, మహాపాత్రో, ఏవో హైమావతి, నాయకు లు జగదీష్,సూర్యారావు, బొడ్డహరిబాబు పాల్గొన్నారు.
ఫరాజాం,డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): రైతులు రసా యన ఎరువుల వినియోగం తగ్గించాలని వ్యవసాయ శాఖ ఏడీ కె.చంద్రరావు సూచించారు. ఆగూరులో రైత న్నా-మీకోసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో టీడీపీ నాయుకులు గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీను, నాగళ్ల అప్పలనాయుడు, వంగా వెంకటరావు, సుమల వెంకటమన్మఽథరావు ఏవో చీకటి రఘునాద్ పాల్గొన్నారు.
ఫడెంకాడ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ధ్యేయమని ఏవో టి. సంగీత తెలిపారు. మండలంలోని పినతాడివాడ, అక్కి వరంల్లో రైతన్నా-మీకోసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, ఎంపీటీసీ అచ్చంనాయుడు,భాస్కరరావు, పశువైద్యాధికా రి దినేష్, రామచంద్రరావు పాల్గొన్నారు.
ఫశృంగవరపుకోట, డిసెంబరు3(ఆంధ్రజ్యోతి): తక్కు వ ధరకు దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని ఎస్.కోట జనసేననాయకుడు ఒబ్బిన సన్యాసి నాయుడు రైతులకు సూచించారు. స్థానిక రైతు సేవా కేంద్రంలో రైతన్నా మీకోసం- వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్య క్రమంలో ఏఈఓ గీత పాల్గొన్నారు.
ఫవేపాడ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): సాగులో నూతనపద్దతుల అమలుకు రైతులు ముందుకు రావా లని మండల ప్రత్యేక అధికారి లక్ష్మీనారాయణ కోరారు. మండలంలోని దబ్బిరాజుపేట గ్రామ రైతు సేవాకేం ద్రంలో వ్యవసాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో రైతన్నా- మీకోసం కార్యక్రమం నిర్వహించారు.