Share News

Sanitation and Drinking Water పారిశుధ్యం, తాగునీటిపై శ్రద్ధ చూపాలి

ABN , Publish Date - Jun 27 , 2025 | 11:19 PM

Focus Should Be on Sanitation and Drinking Water గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటిపై శ్రద్ధ చూపాలని ఉమ్మడి జిల్లా జడ్పీ సీఈవో బీవీ సత్యనారాయణ ఆదేశించారు. గతేడాది విజయనగరం జిల్లా గుర్లలో జరిగిన సంఘటనలు పునరావృతం కారాదన్నారు. శుక్రవారం సాలూరు ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించారు.

 Sanitation and Drinking Water  పారిశుధ్యం, తాగునీటిపై శ్రద్ధ చూపాలి
సాలూరు మండల ఎంపీడీవోకు సూచనలిస్తున్న విజయనగరం జడ్పీ సీఈవో బీవీ సత్యనారాయణ

సాలూరు రూరల్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటిపై శ్రద్ధ చూపాలని ఉమ్మడి జిల్లా జడ్పీ సీఈవో బీవీ సత్యనారాయణ ఆదేశించారు. గతేడాది విజయనగరం జిల్లా గుర్లలో జరిగిన సంఘటనలు పునరావృతం కారాదన్నారు. శుక్రవారం సాలూరు ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించారు. వర్షాకాలం నాలుగు నెలల పాటు ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు అమ్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎంపీడీవోలు తదితరులు రోజు ఉదయం ఆరు గంటలకే ఒక గ్రామాన్ని పరిశీలించాలన్నారు. పారిశుధ్యం, తాగునీరు, మురుగు కాలువల నిర్వహణపై ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. ప్రతి 15 రోజులకు వాటర్‌ ట్యాంకులను శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు తాగునీటి పరీక్షలు చేయించాలన్నారు. సజావుగా చెత్త సేకరణ నిర్వహించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధుల ఖాళీలపై ప్రతి నెల ఎన్నికల కమిషనర్‌కు వివరాలు పంపిస్తున్నామన్నారు. ఆయన వెంట జడ్పీ డిప్యూటీ సీఈవో ఆర్‌.వెంకట్రామన్‌, బొబ్బిలి డీఎల్‌డీవో కిరణ్‌కుమార్‌, ఎంపీడీవో గొల్లపల్లి పార్వతి తదితరులున్నారు.

Updated Date - Jun 27 , 2025 | 11:19 PM