చెత్త సంపద కేంద్రాలపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:00 AM
గ్రామాల్లో చెత్తసంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ సీఈవో సత్యనారాయణ కోరారు.
గజపతినగరం,నవంబరు18(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో చెత్తసంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పీ సీఈవో సత్యనారాయణ కోరారు. మంగళవారం మండలంలోని గుడివాడ, మరుపల్లి గ్రామాల్లో గల చెత్త సంపద కేంద్రాలను పరిశీలించారు. గుడివాడలో పారిశుధ్య పనులపై చేపట్టిన ఐవీఆర్‌ఎస్ సర్వే కాల్స్‌పై గ్రామస్థులను అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కళ్యాణి,డిప్యూటీ ఎంపీడీవో జనార్దన్, రమణ పాల్గొన్నారు.