ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టిసారించాలి
ABN , Publish Date - May 22 , 2025 | 12:18 AM
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించి న్యాయం చేయాలని యూటీఎఫ్ జిల్లా సహాయ అధ్యక్షుడు ప్రసన్నకుమార్ కోరారు.ప్రభుత్వ పాఠశాలల్లో రెండు మీడియాలు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.
రామభద్రపురం, మే 21(ఆంధ్రజ్యోతి):రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించి న్యాయం చేయాలని యూటీఎఫ్ జిల్లా సహాయ అధ్యక్షుడు ప్రసన్నకుమార్ కోరారు.ప్రభుత్వ పాఠశాలల్లో రెండు మీడియాలు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. బుధవారం రామభద్రపురంలో విలేకరులతో మాట్లాడుతూ 45 మంది పిల్లలకు హైస్కూల్‌లో రెండు సెక్షన్లు ఉండాలని, ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం పోస్టు ఎస్‌జీటీలతో నింపాలని డిమాండ్ చేశారు. స్కూల్ అసిస్టెంట్లను హైస్కూల్‌కే పరిమితం చేయాలని, యూపీ స్కూళ్లకు సబ్జెక్టు టీచర్లు ఇవ్వాలని కోరారు. ఫౌండేషన్ పాఠశాలలో 1:30 కాకుండా 1:20 చేయాలన్నారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో చెప్పకోదగ్గ మార్పులు లేవన్నారు. కార్యక్రమంలో యుటీఎఫ్ నాయకులు శశి, సుధాకర్, కోట శ్రీరాములునాయుడు, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.