Students’ Health and Education విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై దృష్టి సారించండి
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:43 PM
Focus on Students’ Health and Education వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై దృష్టి సారించాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి సత్య నారాయణ ఆదేశించారు. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయాలన్నారు. ఆహ్లాదకర వాతా వరణంలో పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
బాత్‌రూమ్‌లు వినియోగించకపోవడంపై ఆగ్రహం
వార్డెన్, కుక్ సస్పెండ్‌కు ఆదేశాలు
కురుపాం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై దృష్టి సారించాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి సత్య నారాయణ ఆదేశించారు. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయాలన్నారు. ఆహ్లాదకర వాతా వరణంలో పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సోమవారం కురుపాంలో జ్యోతి బాపులే బాలుర రెసిడెన్సియల్ పాఠశాలను సందర్శించారు. భోజనం, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. సిలబస్ ఎంతవరకు అయ్యిందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. శత శాతం ఉత్తీర్ణత సాఽధించేలా చర్యలు చేపట్టాలని అక్కడి సిబ్బందికి సూచించారు. అనంతరం బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో నూతనంగా నిర్మించిన స్నానపు గదులు, మరుగుదొడ్లును పరిశీలించారు. వాటికి రన్నింగ్ వాటర్ సదుపాయం లేదని గుర్తించారు. బాత్‌రూములను వినియోగించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వార్డెన్ శ్రీనివాసరావు, కుక్ సోమేశ్వరరావును సస్పెండ్ చేయాలని ఆదేశించారు.