దీర్ఘకాలిక సమస్యలపై దృష్టి సారించండి
ABN , Publish Date - May 24 , 2025 | 12:15 AM
పట్టణంలో దీర్ఘకాలిక సమస్యల పై ప్రత్యేక దృష్టి సారించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.గంగునాయుడు కోరారు.
పార్వతీపురంటౌన్, మే 23 (ఆంధ్రజ్యో తి): పట్టణంలో దీర్ఘకాలిక సమస్యల పై ప్రత్యేక దృష్టి సారించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.గంగునాయుడు కోరారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో స్థానిక సీపీఎం నాయకులు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పార్వతీపురం పట్టణంలో తాగునీరు, పారిశుధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉంటే.. పాలకవర్గ సభ్యులు సమావేశా లను బాయ్‌కట్ చేస్తూ వెళ్లిపోవడం సరికాదన్నారు. అంతేకాకుండా ప్రజా స్వామ్యవ్యవస్థలో అధికార, ప్రతిపక్ష పాలకవర్గ సభ్యులు పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు జీవీ రమణ, బీవీ రమణ, శ్రీదేవి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.