focus on industries పరిశ్రమలు తెరుచుకునేలా చూస్తాం
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:18 AM
focus on industries జిల్లాలో ఎన్నో పరిశ్రమలు ఉండేవని, విద్యుత్ చార్జీల కారణంగా ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు నష్టాల పాలై మూతపడ్డాయని, అవన్నీ మళ్లీ తెరుచుకునేలా చూస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హామీ ఇచ్చారు.
పరిశ్రమలు తెరుచుకునేలా చూస్తాం
విజయనగరం సాంస్కృతిక రాజధాని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
విజయనగరం దాసన్నపేట, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్నో పరిశ్రమలు ఉండేవని, విద్యుత్ చార్జీల కారణంగా ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు నష్టాల పాలై మూతపడ్డాయని, అవన్నీ మళ్లీ తెరుచుకునేలా చూస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హామీ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరానికి సోమవారం వచ్చిన ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌వర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పరిశ్రమలు పునః ప్రారంభమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. విద్యా సంస్థల వద్ద డ్రగ్స్ వినియోగం ఇంకా ఆగలేదని, దీనిపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ చేపట్టి డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోందన్నారు. ఇటీవల విజయనగరంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న వ్యక్తి పట్టుబడడం ఆందోళన కలిగించిందన్నారు. నిఘా వ్యవస్థలు మరింత జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. తొలుత మహాకవి గురజాడ విగ్రహానికి పూలమాల వేసి పాదయత్రగా బయలుదేరారు. విజయనగరం సాంస్కృతిక రాజధానిగా పేరొందిందని, కాలక్రమంలో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.