మేలు చేసే పనులపై శ్రద్ధవహించాలి
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:36 PM
ప్రభుత్వం అప్పగించిన కార్యక్రమాలను మొక్కుబడిగా నిర్వహించవద్దని, వ్యక్తులు, సమాజానికి మేలు చేసే పనులపై అధికారులు శ్రద్ధ వహించాలని డివిజనల్ అభివృద్ధి అధికారి హేమసుందర్ అన్నారు.
డీఎల్‌డీవో హేమసుందర్
చీపురుపల్లి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):ప్రభుత్వం అప్పగించిన కార్యక్రమాలను మొక్కుబడిగా నిర్వహించవద్దని, వ్యక్తులు, సమాజానికి మేలు చేసే పనులపై అధికారులు శ్రద్ధ వహించాలని డివిజనల్ అభివృద్ధి అధికారి హేమసుందర్ అన్నారు. శనివారం ఆయన మెట్టపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పరిశుభ్రతపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. చేతులు శుభ్రం చేసే విధానంపై వారికి అవగాహన కల్పించారు. మధ్యాహ్న భోజనం తయారీని పరిశీలించారు. వీధుల్లో చెత్త వేయవద్దని, ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట డిప్యుటీ ఎంపీడీవో అప్పలనాయుడు, సిబ్బంది ఉన్నారు. రామలింగపురం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో హెచ్‌ఎం గొర్లె పద్మావతి, బీజేపీ అధ్యక్షుడు ఇప్పిలి నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.