Share News

Cyclone Damages తుఫాన్‌ నష్టాలపై దృష్టిపెట్టండి

ABN , Publish Date - Oct 30 , 2025 | 12:22 AM

Focus on Cyclone Damages తుఫాన్‌ నష్టాలపై ప్రత్యేక దృష్టిసారించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశా రని తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

 Cyclone Damages తుఫాన్‌ నష్టాలపై దృష్టిపెట్టండి
వంతరాంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

  • జిల్లా యంత్రాంగం అప్రమత్తపై సీఎం హర్షం

  • కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ నష్టాలపై ప్రత్యేక దృష్టిసారించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశా రని తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ‘ స్థానిక ప్రజలు, నాయకులు, యువత సహకారం, అధికారుల సమన్వయంతో సమర్థంగా మొంథా తుఫాన్‌ను ఎదుర్కోగలిగాం. ప్రస్తుతం పల్లె, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం, తాగునీటిపై దృష్టి సారించాలి. మట్టిగోడలు, పాడైన, కూలిన వాటిని గుర్తించాలి. పశువులు, వ్యవసాయ నష్టాలను అంచనా వేయాలి. గురువారం నుంచి విద్యాలయాలను పునఃప్రారంభించొచ్చు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలో తరగతులు నిర్వహించరాదు. ముందస్తుగా ఆసుపత్రులకు తరలించిన గర్భిణులను మరికొన్ని రోజులు అక్కడే ఉంచాలి. చెరువులకు గండ్లు పడే అవకాశం ఉన్నందున ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌ అధికారులు పర్యవేక్షించాలి. ఫుడ్‌సేప్టీ అధికారులు షాపులపై దాడులు చేయాలి. ’ అని కలెక్టర్‌ తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రిలీఫ్‌ కేంద్రాల్లో ఉన్న వారికి కిట్లు అందించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో హేమలత, సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి తదితరులు పాల్గొన్నారు.

వంతరాంలో పర్యటన

సీతానగరం: బలిజిపేట మండలం వంతరాం గ్రామంలో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పర్యటించారు. ఈ సంద ర్భంగా గ్రామ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీని సందర్శించి రెండు రోజుల పాటు కరెంట్‌ లేదని అక్కడి వారు తెలిపారు. దీంతో కలెక్టర్‌ ట్రాన్స్‌కో సిబ్బందితో మాట్లాడి కరెంట్‌ తెప్పించారు. ఎలక్ర్టికల్‌ ఏఈని సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత నూకలవాడ పునరావాస కేంద్రానికి చేరుకుని తుఫాన్‌ బాధితులతో మాట్లాడారు. అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.

Updated Date - Oct 30 , 2025 | 12:22 AM