Share News

Students' Health విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:46 PM

Focus Must Be Given to Students' Health గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్‌ శ్రీవాత్సవ ఆదేశించారు. బుధవారం తోణాం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు.

 Students' Health విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
తోణాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో శ్రీవాత్సవ

సాలూరు రూరల్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్‌ శ్రీవాత్సవ ఆదేశించారు. బుధవారం తోణాం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు. పాముకాటుకు గురైన విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని హెచ్‌ఎం రామారావు, వార్డెన్‌ లచ్చయ్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డైనింగ్‌ బ్లాక్‌ తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. పాముకాటుకు గురైన విద్యార్థి క్షేమంగా ఉన్నాడన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. తోణాం పాఠశాల ఆవరణలో తుప్పలు, పొదలు తొలగించే చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఆ ప్రాంతంలో లైటింగ్‌ పెంచాలన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఏ విద్యార్థి అస్వస్థతకు గురైన తక్షణమే ఆసుపత్రికి తలించాలని సూచించారు. తోణాంలో టాయిలెట్లు, డైనింగ్‌ హాల్‌ నిర్మాణానికి డీఏ జుగాలో కేంద్ర ప్రభుత్వ నిధులకు ప్రతిపాదనలు చేశామన్నారు.

దోమల నివారణ మందు పిచికారీ

పాచిపెంట: మలేరియా దోమల నివారణలో భాగంగా కొత్తవలస గ్రామంలో యాంటీలార్వల్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో శ్రీవాత్సవ ఆధ్వర్యంలో డ్రోన్‌ సాయంతో ఆ గ్రామ చెరువులో దోమల నివారణ మందు పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 11:47 PM