Nagavali నాగావళిలో పెరిగిన వరద
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:59 PM
Floods Rise in Nagavali తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళిలో శుక్రవారం వరద ప్రవాహం పెరిగింది. ఒడిశాతో పాటు జిల్లాలోనూ వర్షాలు కురుస్తుండడంతో 6500 క్యూసెక్కులు నదిలో చేరింది.
గరుగుబిల్లి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): తోటపల్లి ప్రాజెక్టు పరిధిలోని నాగావళిలో శుక్రవారం వరద ప్రవాహం పెరిగింది. ఒడిశాతో పాటు జిల్లాలోనూ వర్షాలు కురుస్తుండడంతో 6500 క్యూసెక్కులు నదిలో చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై స్పిల్‌వే గేట్ల నుంచి 5 వేల క్యూసెక్కులను దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. సాగునీటి అవసరాల కోసం ప్రధాన కాలువల నుంచి 1,320 క్యూసెక్కులను సరఫరా చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 104.51 మీటర్ల మేర నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.