Share News

Nagavali నాగావళికి వరద

ABN , Publish Date - Sep 11 , 2025 | 12:01 AM

Flood in Nagavali తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదికి బుధవారం వరద పోటెత్తింది. పైప్రాంతం ఒడిశాలో వర్షాలు కురుస్తుండడంతో నదిలోకి సుమారు 8 వేల క్యూసెక్కులు చేరింది.

  Nagavali నాగావళికి వరద
తోటపల్లి స్పిల్‌వే గేట్లు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

గరుగుబిల్లి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదికి బుధవారం వరద పోటెత్తింది. పైప్రాంతం ఒడిశాలో వర్షాలు కురుస్తుండడంతో నదిలోకి సుమారు 8 వేల క్యూసెక్కులు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమై స్పిల్‌వే గేట్లు నుంచి దిగువ ప్రాంతాలకు 4 వేల క్యూసెక్కులను విడుదల చేశారు. సాగునీటికి గాను ప్రధాన కాలువల నుంచి 1,320 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 104.51 మీటర్ల మేర నీటి నిల్వ ఉందని ప్రాజెక్టు ఈఈ హెచ్‌.మన్మథరావు బుధవారం తెలిపారు. ఇదిలాఉండగా జంఝావతి ప్రాజెక్టుకు 230 క్యూసెక్కులు, వట్టిగెడ్డకు 0.868, వెంగళరాయసాగర్‌కు 1,463 క్యూసెక్కుల వరద చేరింది.

Updated Date - Sep 11 , 2025 | 12:01 AM