Share News

ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:16 AM

ఎస్సీ వర్గీకరణలో రెల్లి రెల్లి గ్రూపు కులాలలకు ఐదు శాతం రిజర్వేషన్‌ వర్తింపచేయాలని బొబ్బిలి రెల్లి కుల (ఎస్‌సీఏ) గ్రూపు సంఘం అధ్యక్షుడు పి.చంద్రశేఖర్‌ అన్నారు.

ఐదు శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

బొబ్బిలి రూరల్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణలో రెల్లి రెల్లి గ్రూపు కులాలలకు ఐదు శాతం రిజర్వేషన్‌ వర్తింపచేయాలని బొబ్బిలి రెల్లి కుల (ఎస్‌సీఏ) గ్రూపు సంఘం అధ్యక్షుడు పి.చంద్రశేఖర్‌ అన్నారు. ఈసం దర్భంగా బొబ్బిలి డివిజన్‌ రెల్లి కులస్థులు గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రిలే దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రెల్లి కులం అభివృద్ధి చేందాలంటే వర్గీకరణ చేసి 5 శాతం రిజర్వేషన్‌ కేటాయించాలన్నారు. రాష్ట్రంలో సుమారు 26 లక్షల జనాభా ఉన్నప్పటికీ ప్రత్యేక రిజర్వేషన్‌ లేకపోవడంతో వివిధ రంగాల్లో ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటిం చిన గెజిట్‌లో రెల్లి కులం లేకపోవడం బాధాకరం అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఐదు శాతం రిజర్వేన్లు కేటాయాంచాలని డిమాండ్‌ చేస్తూ తహసీల్దార్‌ ఎం.శ్రీనుకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెల్లి కుల నాయకులు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యేకు వినతి

బొబ్బిలి, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ రెల్లి గ్రూపు కులాల వారికి 13 భాషలు ఉన్నాయని, లిపి లేదని వీరందరినీ ఎస్సీ వర్గీకరణలో వేరు చేయ కుండా ఎ-కేటగిరిలో చేర్చాలని రెల్లి కులపెద్దలంతా స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయనను కోరారు. ఈ మేరకు గురువారం స్థానిక కోటలో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఐదు శాతం రిజర్వేషన్‌ వర్తించేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని వారంతా కోరారు. దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.

Updated Date - Apr 11 , 2025 | 12:16 AM