మత్స్యకారుడి గల్లంతు
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:14 AM
తిప్పలవలస గ్రామానికి చెందిన వాసుపల్లి రాములు(55) సముద్రంలో గల్లంతయ్యాడు.
పూసపాటిరేగ, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని తిప్పలవలస గ్రామానికి చెందిన వాసుపల్లి రాములు(55) సముద్రంలో గల్లంతయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ షిప్పింగ్‌యార్డు నుంచి చేపలవేటకు బోటులో బయలుదేరిన రాములు ఆదివారం రాత్రి విశాఖ తీరానికి 70మైళ్ల దూరంలో ప్రమాదవశాత్తు బోటు నుంచి సముద్రంలో పడిపోయాడు. బోటులో ఉన్నవారు ఎంతగాలించినా జాడ కానరాలేదు. దీంతో మంగళవారం సాయంత్రం విశాఖ పోర్ట్ పోలీస్‌స్టేషన్‌కు స్థానికులు ఫిర్యాదు అందజేశారు. గల్లంతు అయిన మత్స్యకారుడికి భార్య, పిల్లలు ఉన్నారు. వీరి కుటుంబం కూడా ప్రస్తుతం విశాఖలోనే ఉంది.