మనస్తాపంతో మత్స్యకారుడి ఆత్మహత్య
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:04 AM
ముక్కాం గ్రామానికి చెందిన గనగళ్ల రామసుందర్(29) అనే మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
భోగాపురం, ఆగస్టు10(ఆంధ్రజ్యోతి): ముక్కాం గ్రామానికి చెందిన గనగళ్ల రామసుందర్(29) అనే మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ఎస్‌ఐ సూర్యకుమారి ఆదివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముక్కాం గ్రామానికి చెందిన రామసుందర్‌కు కొండ్రాజుపాలెంకు చెందిన ఎలమాజీతో ఏడేళ్ల కిందట వివాహం అయ్యింది. గతంలో ఈయన సముద్రంలో వేట సాగించేవాడు. తర్వాత వేట మానేసి ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. వీరికి ఐదేళ్ల వయస్సుగల రుషి, మూడేళ్ల తన్వి అనే ఇద్దరు పిల్లలు, పక్షవాతంలో ఉన్న తండ్రి రాజు ఉన్నారు. ఇటీవల రామసుందర్ మద్యానికి అలవాటు పడడంతో భార్యా భర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో శనివారం సాయంత్రం తన భార్యని డబ్బులు అడిగే సమయంలో కొద్దిపాటి వివాదం తలెత్తింది. దీంతో మనస్తాపానికి గురైన రామసుందర్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే విజయనగరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై మృతుడి భార్య ఎలమాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.