Share News

చెరువులో చేపలు మృత్యువాత

ABN , Publish Date - Jul 16 , 2025 | 12:01 AM

మండలంలోని దత్తి గ్రామ రెవెన్యూ పరిధిలో గల పాచిబంద చెరువులో వందల సంఖ్యలో చేపలు మంగళవారం మృతిచెందాయి.

 చెరువులో చేపలు మృత్యువాత

దత్తిరాజేరు, జూలై 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని దత్తి గ్రామ రెవెన్యూ పరిధిలో గల పాచిబంద చెరువులో వందల సంఖ్యలో చేపలు మంగళవారం మృతిచెందాయి. దీంతో ఆ చెరువును లీజు తీసుకుని, చేపలు పెంచుతున్న పొట్నూరు ఈశ్వరరావు లబోదిబో మంటున్నారు. నాలుగు పైసలు చేతికి అందుతాయనే సమయంలో ఎవరో తెలి యని వారు విషప్రయోగం చేయడంతో చెరువులో చేపలు మొత్తం చనిపోయాయ ని విలపించారు. సుమారు లక్ష రూపాయలపైన నష్టం వాటిల్లిందని చెప్పారు. పెదమానాపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - Jul 16 , 2025 | 12:01 AM