Share News

First Step into P4 పీ4లో తొలి అడుగు

ABN , Publish Date - Jul 05 , 2025 | 10:45 PM

First Step into P4 పీ4- మార్గదర్శి బంగారు కుటుంబంలో భాగంగా సాలూరు నియోజకవర్గంలో పది కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ప్రకటించారు. శనివారం సాలూరు ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గ కార్యాచరణ ప్రణాళికపై సమావేశం నిర్వహించారు.

First Step into P4  పీ4లో తొలి అడుగు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

  • వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి

పార్వతీపురం/సాలూరు, జూలై 5(ఆంధ్రజ్యోతి): పీ4- మార్గదర్శి బంగారు కుటుంబంలో భాగంగా సాలూరు నియోజకవర్గంలో పది కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ప్రకటించారు. శనివారం సాలూరు ఎంపీడీవో కార్యాలయంలో నియోజకవర్గ కార్యాచరణ ప్రణాళికపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, విద్య, ఆరోగ్యం, రవాణా, నీటి సరఫరా, పౌర సేవలపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..‘ పేదరిక ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు పీ4 మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పేదరికం నుంచి ఆయా కుటుంబాలను బయటకు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి పిలుపు మేరకు నియోజకవర్గంలోని 10 కుటుంబాలకు మార్గదర్శిగా ఉంటా. వారికి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పూర్తిగా కృషి చేస్తా. నియోజకవర్గంలో ప్రతి మండలం నుంచి రెండు కుటుంబాలు, సాలూరు మున్సిపాలిటీ నుంచి రెండు కుటుంబాలకు మార్గదర్శిగా ఉంటా.’ అని తెలిపారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ రామచంద్రరావు, టీడీపీ నాయకులు పరమేశు, తిరుపతిరావు, వేణుగోపాలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 10:45 PM