విజయనగరంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’
ABN , Publish Date - Aug 03 , 2025 | 11:21 PM
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోగల 32, 33, 34 డివిజన్లలో ఆదివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు.
విజయనగరం రూరల్, ఆగస్టు 3 ( ఆంధ్రజ్యోతి): విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోగల 32, 33, 34 డివిజన్లలో ఆదివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతోపాటు ఆయా డివిజన్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు. తొలుత ఏడాదిలో నియోజకవర్గం పరిధిలోని చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రత్యేక స్ర్కీన్‌పై వీడియోల ద్వారా వివరించారు.