Share News

బొబ్బిలిలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’

ABN , Publish Date - Jul 06 , 2025 | 11:56 PM

బొబ్బిలి మునిసిపాలిటీలోని ఐదో వార్డులో ఆదివారం ఎమ్మెల్యే బేబీనాయన సుపరిపాలనలో తొలి అడు గు కార్యక్రమాన్ని నిర్వహించారు.

బొబ్బిలిలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’

బొబ్బిలి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మునిసిపాలిటీలోని ఐదో వార్డులో ఆదివారం ఎమ్మెల్యే బేబీనాయన సుపరిపాలనలో తొలి అడు గు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి టీడీపీ ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన ఘనవిజయాలు, అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసంద ర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అపార మైన అనుభవం, పరిపాలనా దక్షతతో రాష్ర్టాన్ని ప్రగతిపథం వైపు దూసుకుపోయేలాతీర్చిదిద్దుతున్నారని తెలిపారు.ప్రపంచమంతా ఆంధ్ర ప్రదేశ్‌ వైపు చూడాలన్న తన ఆకాంక్షను విజయవంతంగా నెరవేర్చేం దుకు సానుకూలమైన అడుగులు పడుతున్నాయన్నారు. అనేక పరిశ్ర మలు, కంపెనీలు రాష్ర్టానికి వస్తుండడమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు.మూడోవార్డుకు చెందిన టీడీపీ కార్యకర్త పిట్టా రమేష్‌ పార్టీ సభ్యత్వం కలిగిఉండగా ఇటీవల ఆయన మృతిచెందడంతో రూ.ఐదు లక్షల బీమా చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు బేబీనాయన అం దజేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరా వు, ఐదో వార్డు కౌన్సిలరు, వెలడాడ హైమావతి, క్లస్టర్‌, బూత్‌, వార్డు ఇన్‌చార్జిలు, కేఎస్‌ఎస్‌లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 11:56 PM