Share News

Totapalli తోటపల్లిలో తొలి ఏకాదశి పూజలు

ABN , Publish Date - Jul 06 , 2025 | 11:15 PM

First Ekadashi Pujas Held at Totapalli త్తరాంధ్రలో చినతిరుపతిగా పేరొందిన తోటపల్లి ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా నమో నారాయణ నామస్మరణ మార్మోగింది. వేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి దేవస్థానాలకు భక్తులు పోటెత్తారు. ఉభయ ఆలయాల్లో స్వామివార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

  Totapalli తోటపల్లిలో తొలి ఏకాదశి పూజలు
ప్రత్యేక అలంకరణలో స్వామివారి ఉత్సవమూర్తులు

గరుగుబిల్లి, జూలై6(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా పేరొందిన తోటపల్లి ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా నమో నారాయణ నామస్మరణ మార్మోగింది. వేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి దేవస్థానాలకు భక్తులు పోటెత్తారు. ఉభయ ఆలయాల్లో స్వామివార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన అర్చకుడు వీవీ అప్పలచార్యుల ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ విశేష కల్యాణోత్సవాలను తిలకించి పరవశించిపోయారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో వీవీ సూర్యనారాయణ, సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. అనంతరం వారికి అన్నసమారాధన , ఉచిత ప్రసాదాలు అందించారు. జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు కూడా భక్తులతో కిటకిటలాడాయి. రామమందిరాలు, వేంకటేశ్వర, వేణుగోపాలస్వామి తదితర ఆలయాల్లో ఏకాదశి పూజలను నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా అంతటా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Updated Date - Jul 06 , 2025 | 11:15 PM