Share News

15 టన్నుల పేలుడు పదార్థాల కాల్చివేత

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:17 AM

వల్లంపూడి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గతంలో పట్టుకున్న అక్రమ పేలుడు పదార్థాలను అత్యంత భద్రతా చర్యల మధ్య శుక్రవారం సురక్షితంగా కాల్చివేశారు.

 15 టన్నుల పేలుడు పదార్థాల కాల్చివేత

వేపాడ, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): వల్లంపూడి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గతంలో పట్టుకున్న అక్రమ పేలుడు పదార్థాలను అత్యంత భద్రతా చర్యల మధ్య శుక్రవారం సురక్షితంగా కాల్చివేశారు. 2018 సంవత్సరం జనవరి నెలలో అనుమతులు లేకుండా అక్రమంగా లారీతో రవాణా చేస్తున్న 15 టన్నుల పేలు డు పదార్థాలను విజిలెన్స్‌ పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, ఈ పేలుడు పదార్థాలను లారీతో పాటు వల్లంపూడి పోలీసులకు అప్పగించారు. అప్పటి నుంచి కోర్టులో జరిపిన న్యాయ ప్రక్రియల అనంతరం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ఎస్‌.కోట రూరల్‌ సీఐ అప్పలనాయుడు, ఆర్‌ఐ ఇన్‌స్పెక్టర్‌ టి.శ్రీనివాసరావు, మంగళగిరి, విజయనగరం జిల్లా బీడీ టీమ్‌ల ఎక్సపర్ట్‌లు సారథ్యంలో కరకవలస గ్రామ సమీపంలోని కొండ ప్రాంతానికి తరలించి ప్రత్యేక మైన ప్రదేశంలో సురక్షితంగా దహనం చేశారు. కార్యక్రమంలో వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్‌, హెచ్‌సీ శేషాద్రి, సిబ్బంది సురేష్‌, నాగరాజు, అప్పలరాజు, వీఆర్వోలు శ్రీనువాసరావు, అప్పలరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 12:18 AM