Share News

తమటాడలో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:04 AM

తమటాడ గ్రామంలో ఆదివారం వేకువజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

తమటాడలో అగ్ని ప్రమాదం

  • రూ.4 లక్షల ఆస్తి నష్టం

బొండపల్లి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): తమటాడ గ్రామంలో ఆదివారం వేకువజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామస్థులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో కోండ్రు రవణమ్మకు చెందిన పూరింటి నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఈ మంటలు పక్కన ఉన్న పశువుల శాలకు వ్యాపించ డంతో గ్రామస్థులు అప్రమత్తం అయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి, మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో రమణమ్మ ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలెండరుకు మంటలు వ్యాపించడంతో ఒక్కసారి గా పెద్ద శబ్ధంతో సిలెండర్‌ పేలి, మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒక పూరిల్లు, పశువుల శాల దగ్ధమైంది. సుమారు రూ.4 లక్షల ఆస్తినష్టం సంభవిం చినట్టు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. ప్రభుత్వం ఆదుకొని ఇళ్లు మంజూరు చేయాలని బాధితులు కోరుతున్నారు.

Updated Date - Sep 22 , 2025 | 12:04 AM