Share News

తాళ్లడుమ్మలో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:42 PM

మండలంలోని తాళ్లడుమ్మ పంచాయతీ కేంద్రంలో ఆదివారం ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు లక్షల నగదు, ఆస్తిపత్రాలు దగ్ధమయ్యాయి.

తాళ్లడుమ్మలో అగ్ని ప్రమాదం

  • సుమారు రూ.10 లక్షలు నష్టం

జియ్యమ్మవలస, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తాళ్లడుమ్మ పంచాయతీ కేంద్రంలో ఆదివారం ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు లక్షల నగదు, ఆస్తిపత్రాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.పది లక్షల వరకూ నష్టం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. పళ్లెం శ్రీరామ్మూ ర్తికి చెందిన పెంకుటింట్లో ఫ్రిడ్జ్‌ వద్ద తొలుత మంట ప్రారంభమై ఇల్లంతా వ్యాపించింది. ఈ విషయాన్ని స్థానికంగా ఉంటున్న హోంగార్డు పాలపర్తి సూర్య నారాయణ (సురేష్‌) విషయాన్ని గుమ్మలక్ష్మీపురం ఫైర్‌ స్టేషన్‌కు, చినమేరంగి పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి ఎస్‌ఐ ఎన్‌.ప్రశాంత్‌కుమార్‌కు సమాచారం అందించారు. విషయాన్ని తెలుసుకున్న ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది, ఎస్‌ఐ ప్రశాంత్‌కుమార్‌ సంఘ టన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఇటీవల పొలం అమ్మిన రూ.4 లక్షలు, పదెకరాల పొలం దస్తావేజులు, పాస్‌ బుక్‌లు, టైటిల్‌డీడ్లు, ఎల్‌ఐసీ బాండ్లు, ఇతర విలువైన పత్రాలు అగ్నికి ఆహుతయ్యాయని బాధితుడు తెలిపాడు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌ఐ ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వివరాలు సేకరిస్తున్నామని, బాధితుల ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Aug 24 , 2025 | 11:43 PM