షాపింగ్ కాంప్లెక్సులో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:19 AM
తుమ్మికాపల్లి పరిధిలోని కొత్తవలస-ఎస్.కోట రోడ్డులో ఉన్న సాయిలక్ష్మి కాంప్లెక్సులో గల ఒక షాపులో బుధవా రం అగ్ని ప్రమాదం సంభవించింది.
రూ.లక్ష ఆస్తి నష్టం
కొత్తవలస, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): తుమ్మికాపల్లి పరిధిలోని కొత్తవలస-ఎస్.కోట రోడ్డులో ఉన్న సాయిలక్ష్మి కాంప్లెక్సులో గల ఒక షాపులో బుధవా రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రూ.లక్ష విలువగల ఎలక్ర్టానిక్ ఉపకరణాలు దగ్ధమయ్యాయి. ఈ కాంప్లెక్సులోని ఎలక్ర్టానిక్ ఉపకరణాలు విక్రయించే దుకాణం నుంచి మంటలు రాగా, స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి, మంటలను అదుపు చేశారు. అప్పటికే షాపులోని నాలుగు రిఫ్రిజరేట ర్లు, 3 వాషింగ్ మిషన్లు కాలిపోయాయి. వీటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. షార్టు సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.