Share News

రేగులగూడ కాలనీలో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:40 PM

మండలంలోని రేగులగూ డ కాలనీలో ఆదివారం సంభవించిన అగ్ని ప్రమాదంలో సవర లక్ష్మణరావు అనే గిరిజనుడికి చెందిన పూరిల్లు దగ్ధమయ్యింది.

రేగులగూడ కాలనీలో అగ్నిప్రమాదం

సీతంపేట రూరల్‌, మార్చి 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని రేగులగూ డ కాలనీలో ఆదివారం సంభవించిన అగ్ని ప్రమాదంలో సవర లక్ష్మణరావు అనే గిరిజనుడికి చెందిన పూరిల్లు దగ్ధమయ్యింది. దీంతో పాటు మూడు పశువుల శాలలు అగ్నికి ఆహుతయ్యాయి. మధ్యాహ్నం ఉన్నట్టుండి అగ్గి మంటలు ఎగిసిపడ్డాయని గ్రామస్థులు తెలిపారు. దీంతో గ్రామస్థులు కొత్తూరు అగ్నిమాపక శకటానికి సమాచారం అందించడంతో సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఐ విజయగణేష్‌ గ్రామానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో రూ.3లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు.

Updated Date - Mar 16 , 2025 | 11:40 PM