Fire Accident వస్త్రదుకాణంలో అగ్నిప్రమాదం
ABN , Publish Date - May 06 , 2025 | 11:06 PM
Fire Accident in Clothing Store జిల్లా కేంద్రం పార్వతీపురం ప్రధాన రహదారిలోని ఓ రెడీమేడ్ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
రూ. లక్షల విలువైన దుస్తులు దగ్ధం
పార్వతీపురం టౌన్, మే 6(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురం ప్రధాన రహదారిలోని ఓ రెడీమేడ్ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. చుట్టు పక్కల నివాసితులు, వివిధ షాపుల వారు అగ్నిమాపకశాఖాధికారులకు సమాచారం అందించారు. వెంటనే జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనుబాబు ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షలు విలువ చేసే దుస్తులు అగ్నికి ఆహుతి అయినట్లు యజమాని తెలిపారు. కాగా అగ్నిమాపక అధికారి మాత్రం రూ.25 లక్షల వరకు ఆస్తినష్టం జరగొచ్చని అంచనా వేశారు.