టీడీపీ సభ్యత్వంతో ఆర్థిక భరోసా
ABN , Publish Date - May 09 , 2025 | 12:01 AM
టీడీపీ సభ్యత్వంతో ఆర్థిక భరోసా లభిస్తుందని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. మండలంలోని పోతనాపల్లి పంచాయతీలోని ఎరుకుల పేటకు చెందిన టీడీపీ కార్యకర్త సాహూ ప్రకాష్(55) పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్నాడు.
శృంగవరపుకోట రూరల్, మే 8(ఆంధ్ర జ్యోతి): టీడీపీ సభ్యత్వంతో ఆర్థిక భరోసా లభిస్తుందని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. మండలంలోని పోతనాపల్లి పంచాయతీలోని ఎరుకుల పేటకు చెందిన టీడీపీ కార్యకర్త సాహూ ప్రకాష్(55) పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈనేపథ్యంలో కుటుంబం ఇబ్బందులను గ్రామ టీడీపీ నాయకులు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అమె స్పందించి సభ్యత్వ నమోదుకు సంబంధించిన బీమా ఐదు లక్షల నగదు గురువారం కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్ర మంలో మాజీ సర్పంచ్ గేదేల దేముడమ్మ, కూనిరెడ్డి ముత్యాలనాయుడు, నాయకులు ఇందుకూరి శ్రీనివాసరాజు,గోగాడ సత్యం, ఎంపీటీసీమాజీ సభ్యుడు ఈశ్వరరావు, గేదెల పోతయ్య పాల్గొన్నారు.