ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:02 AM
:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు తీ వ్ర అన్యాయానికి గురవుతున్నారని, వారి తరఫున తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్య నారాయణమూర్తి తెలిపారు.
పాలకొండ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి):కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు తీ వ్ర అన్యాయానికి గురవుతున్నారని, వారి తరఫున తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్య నారాయణమూర్తి తెలిపారు. శనివారం పాలకొండలో రెండో రోజు జరిగిన సీపీఐ జిల్లా మహాసభల్లో మాట్లాడారు. సుపరిపాలన పేరుతో మోదీ, చంద్రబాబు ప్రజ లను దగా చేస్తున్నారని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. అమె రికాకు అనుకూలంగా మోదీ నడుచుకుంటున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు, విద్యుత్ చార్జీలు పెంపు,నిత్యావసర ధరలు పెరుగుదల పెనుభారంగా మారాయన్నారు. విలువైన ఆర్టీసీ స్థలాలను లూలూ సంస్థకు కారుచౌకగా ఇచ్చారని, ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం సరికాదన్నారు. తల్లికివం దనం పథకం 50 శాతం మందికి పథకం వర్తించలేదన్నారు. ఉత్తరాం ధ్ర వలస ప్రాంతంగా తయారైందన్నారు. ఉత్తరాంధ్రాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టు లను పూర్తిచేయాలని డిమాండ్‌చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సమగ్ర అభి వృద్ధి, హక్కులు కోసం ఐక్య పోరాటాలు అవశ్యమన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జల ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామేశ్వరరావు, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, కూరంగి మన్మఽథరావు, ఉత్తరావల్లి మురళీమోహన్, భారతి, ద్వారపూడి అప్పలనాయుడు పాల్గొన్నారు.